మొత్తం పేజీ వీక్షణలు

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

బాలయ్య బాబు వేసిన సూపర్ స్టెప్పు


మీరు బాలయ్య బాబు కి భీభత్సమైన అభిమానులైతే ఇది చదవొద్దని నా విన్నపం. ఆ తరువాత మీ ఇష్టం.




"మంగమ్మ గారి మనవడు" సినిమా చూసారా?  పల్లెటూరి వాతావరణం, అమాయకమనిన మనస్తత్వాలని చూపిస్తూనే పల్లెల్లో పౌరుషాలు, పగల పేరుతో జరిగే ఘోరాలని కూడా ఎర్రని రక్తం రంగరించి మరీ చూపుతుందీ సినిమా. ఈ సినిమాలో భానుమతి నటన అమోఘం.



ఈ సినిమాలో పాటలు మరొక విశేషం. వినడానికి catchy గా కూడా ఉంటాయి. ఆ రోజుల్లో మేనత్త కూతుల్లకో లేక ఎవరైనా ఇష్టమైన అమ్మాయిలకో లైన్ వెయ్యడానికి కుర్రాల్లు వాడిన పాట "దంచవే మేనత్త కూతురా". ఈ పాట వినడానికి ఎంత బావుంటుందో చూడటానికి అంతకంటే ఫన్నీ గా ఉంటుంది. ఈ పాటలో నాకు నవ్వు తెప్పించిన స్టెప్ ని1:25 సె తరువాత ఉంటుంది.
 
 
 
మీరు ఆఫీసు కంప్యూటర్లలో ఈ పాటను చూడలేరు కాబట్టి నాను నచ్చిన ఆ అమోఘమైన స్టెప్ ని GIF picture గా కింద ఇస్తున్నా. ఈ సినిమా కొరియో గ్రాఫర్ ఎవరో గాని ఆ వ్యక్తి ని సన్మానించాలి. వాట్ ఎ క్రియేటివిటీ!!






Balayya_funny2 photo balayya2_zpsac16f7d6.gif

ఇక్కడిదాకా చదివేశారా? మీలో కొందరికి నన్ను దుడ్డు కర్రతో బాదాలని అనిపిస్తుంది కదూ!! కేవలం సరదాకి రాసాను. మరీ టూ మచ్ గా ఫీలైపోకండి. ఐ లవ్ బాలయ్య !!

2 కామెంట్‌లు:

  1. చూచితిని,చూచితిని అంగ్రేజిలో చెబితే ఏం అర్ధమవుతుంటా :) మీ ప్రొఫైల్ మీ ఇష్టం, నా పేరెందుకూ? :)
    బాలయ్య బాబు స్టెప్పులంటే అంతిష్టమా? పాపమ్ సుహాసిని పడబోయి నిలదొక్కుకుంది :)దంచవే మేనత్త కూతురా!!!!!!
    మనలో మనమాటా ఆగిపోయిన బ్లాగులంటే మీకూ ఇష్టమా జిలేబిలాగా :)

    రిప్లయితొలగించండి
  2. దంచి దంచి చేతులు నొప్పి పుట్టి వాళ్ళు ఆపేసారు సరే...మీరు అప్పుడేప్పుడో రాసారు, ఇకపై మళ్ళీ వ్రాయండి.

    రిప్లయితొలగించండి